హనుమకొండ డిసిసి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీ పాల్గొన్నారు. వరంగల్ చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి పనులను చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించడం బిఆర్ఎస్ నాయకులకు వెన్నతోపెట్టి విద్య అని గత 10 ఏళ్లలో చేయాలని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ చేస్తుందన్నారు.