నిర్మాణంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనులలో ఏవైనా అదనపు పనులు ఉంటే వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తయిన పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. కళాక్షేత్రంలో నిర్మాణ పనులకు సంబంధించి పూర్తి చేయడంపై ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.