ప్రభుత్వ పథకాలు అర్హులైన షెడ్యూల్ కులాలకు చెందిన లబ్ధిదారులకు అందాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లాలో షెడ్యూల్ కులాలకు అందిస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు..