ఇంటర్ మిడియేట్ ఫస్టియర్ లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు వరంగల్, హనుమకొండ డీఐఈవోలు గోపాల్, సుమన్ శ్రీధర్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. బోర్డు నిర్దేశించిన ప్రవేశాల గడువు ఈ నెల 7తో ముగియగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 15 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు అధికార వర్గాలు ఆదేశాలు జారీ చేసినట్లు వారు పేర్కొన్నారు.