హనుమకొండలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజా యుద్దానౌక గద్దరన్నా సాహిత్యం నేపథ్యం పట్ల పాటల జీవఖని గద్దర్, తరగని గని గద్దర్, లష్కర్, అండర్ గ్రౌండ్ పుస్తకాలను సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరితో ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆవిష్కరించారు. గద్దర్ సామజిక నేపథ్యం నేటి తరానికి ఒక నిలువుటద్దం. గద్దర్ మాటైనా, పాటైనా ఏప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకే అని అన్నారు.