వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవిశరన్నవరాత్రలు నాల్గవ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం నిత్యాహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించి పూజారాధనలు జరిపారు. అమ్మవారిని ఉదయం సూర్యప్రభ వాహనం* మీద సాయంకాలం హంస వాహనం మీద ఊరేగింపు జరిపారు.