హనుమకొండ నియోజకవర్గం పరిధిలో నిర్మించిన రెండు పడకల ఇళ్లను నిజమైన అర్హులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా గతంలో రెండు పడకల కోసం కేటాయించిన స్థలంలో ఉన్న అర్హులకు ఇళ్లను అందిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు శనివారం అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్ లలో పర్యటించారు. నిర్మాణం చేపట్టి చాలా ఏళ్లుగా తమ స్వార్ధ రాజకీయాల కోసం, దళారుల లబ్దిల కోసం జాప్యం చేశారాని మండిపడ్డారు.