తెలంగాణ రాష్ట్రంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలగా కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపు పొందిందని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. మల్లారెడ్డి అన్నారు. సోమవారం కేయూ క్యాంపస్‌లోని కో ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల 15వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. అత్యుత్తమ ఫలితాలతో కళాశాల ముందుకు సాగుతోందని చెప్పారు. కళాశాల విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందారని అభినందించారు.