విద్యార్థులతో కలిసి వరంగల్ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 3, 4 తేదీలలో జరిగే ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా 36వ మహాసభలను జయప్రదం చేయాలని వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఎస్ఎఫ్ఐ 36వ జిల్లా మహాసభలకు మేధావులు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరారు.