మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా హనుమకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.