కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ భద్రకాళి దేవాలయంలో కార్తీక దీపోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు వేదాశీర్వచనం ఇచ్చి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందంజేశారు. అనంతరం మంత్రి సురేఖ భక్తులతో కలిసి కార్తీక దీపాలను వెలిగించారు. పలువురు భక్తులకు వాయనాలు ఇచ్చారు. వేదపాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.