హనుమకొండ, వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. శనివారం హనుమకొండలో ఆయన మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ రిజవాన్ బాషా తో కలిసి మంత్రి
కేటీఆర్ పర్యటన పై అధికారులతో సమీక్షించారు.