హనుమకొండ కలెక్టరేట్లో సోమవారం జాతీయ విద్యా దినోత్సవంలో మౌలానా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నివాళులు అర్పించారు. జాతీయ విద్యా దినోత్సవం కలెక్టరేట్లో జరుపుకుంటున్నాము అలాగే మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ లో కూడా జరుపుకుంటున్నాము. భారతరత్న పొందిన గొప్ప వ్యక్తి అని, చాలా సంస్థలు ఐఐటి, సిఎస్ఐఆర్ సంస్థలు అన్నీ కూడా ఆయన చేసిన కృషి ఫలితమే అన్నారు.