కాజీపేట నీట్ ప్రాంతంలో ఫుట్పాత్ లపై ఉన్న నిర్మాణాలను బల్దియా డీఆర్ఎఫ్ సిబ్బంది బుధవారం తొలగించారు. చిరు వ్యాపారులు వ్యతిరేకించినప్పటికీ బలవంతంగా తీసివేశారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని ఆదేశాల మేరకు స్మార్ట్ సిటీ భాగంలో నగరంలో కూడళ్లు, రహదారుల సుందరీకరణ నేపథ్యంలో ఫుట్పాత్ లపై ఉన్న డబ్బాలు, తోపుడు బండ్లను తొలగించారు.