హనుమకొండ కలెక్టరేట్లో ల్యాండ్, ఎట్రసిటీ సమస్యలపై తెలంగాణ ఎస్సి, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్ లు మొదట మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదుపరి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పుష్ప గుచ్చం ఇచ్చి ఆహ్వానించారు.