ఎస్సీ ఎస్టీ కేసుల పరిష్కారంలో అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, 15 రోజుల్లో పరిష్కరించి వాటి నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో భూ, అట్రాసిటీ సమస్యలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ పరిధిలో నమోదైన అట్రాసిటీ కేసులు, వాటి పురోగతి వివరాలను పోలీసులు ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.