వరద ముప్పు నివారణకు చర్యలు చేపట్టండి: కలెక్టర్

69చూసినవారు
ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వరద ముంపు ముప్పు నివారణకు సత్వర చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆదివారం వరంగల్ పోతన నగర్ సమీపంలోని భద్రకాళి చెరువు కట్ట వద్ద వరద ఉధృతి ఎక్కువ కావడంతో ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం చోటు చేసుకోకముందే చెరువు కట్ట వద్ద ఇసుక బస్తాలతో నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్