సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలను అత్యంత జాగ్రత్తగా ఈ నెల 30వ తేదీ నాటికి ఆన్ లైన్ లో నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేయడంపై ఎంపీడీవోలు, ఎంపీఓ, ఎంపీఎస్వోలతో సమావేశాన్ని నిర్వహించారు. సర్వే పత్రాల భద్రత విషయంలో సూపర్వైజర్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.