మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ శుక్రవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులలో పాల్గొంటారు. ఉదయం 10: 30 కు కాజీపేట 47వ డివిజన్ లోని బోడగుట్ట పైన ట్రెక్కింగ్ ను ప్రారంభిస్తారు. 01: 30కు 10వ డివిజన్ లోని సిసి రోడ్డు, ఆర్సిసి స్లాబ్ కు శంకుస్థాపన, 2 గంటలకు 10వ డివిజన్ లో డ్రైనేజ్ శంకుస్థాపన, సాయంత్రం 4కు భద్రకాళి బండ్ దగ్గర భద్రకాళి చెరువులో బోటింగ్ ప్రారంభిస్తారు.