యువత రక్తదానం చేయడం అభినందనీయం: కలెక్టర్

68చూసినవారు
ఆపదలో ఉన్నవారికి దాతలు రక్తదానం చేయడం వలన ప్రాణదాతలుగా నిలుస్తారని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం సుబేదారిలోని రెడ్ క్రాస్ సొసైటీ లో అహ్మదీయ, నేతాజీ యువ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చేవిధంగా ప్రోత్సహించిన నిర్వాహకులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్థులకు కలెక్టర్ పండ్లు పంపిణీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్