వరంగల్ – నల్గొండ- ఖమ్మం నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నికలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరుతూ పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు శనివారం విస్తృతంగా ప్రచారం చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఒక్క పట్టభద్రుల ఇంటింటికి వెళ్లి తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని అభ్యర్థించారు.