హనుమకొండ సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు హనుమకొండ జిల్లా న్యాయవాదుల లీగల్ సెల్ సభ్యులు బార్ ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా కమిటీ సభ్యులను శాలువా తో సత్కరించి, వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.