రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

14150చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మంగళవారం పాదచారుడిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుబ్బేటి తండాకు చెందిన భూక్య రమణ(75)అనే వృద్ధుడు మృతి చెందాడు. స్థానికులు తెలిసిన వివరాల ప్రకారం.. మృతుడు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకొని తిరిగి తండాకు వెళుతుండగా వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్లుతున్న కారు అతివేగంగా వెళ్లి వృద్ధుడిని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. గత సంవత్సరం భార్య మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్