వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం పరిశీలించిన ఎంపిడివో చక్రాల సంతోష్ కుమార్, ఉపాధి హామీ పని ప్రదేశాన్ని పరిశీలించి ఉపాధి కూలీలకు తగు సూచనలు జారీ చేసారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయమే పనులకు వచ్చేలా చూడాలని చెప్పారు. పని ప్రదేశంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని పంచాయతీ కార్యదర్శి హుస్సేన్ కు సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 50 మంది ఉపాధి కూలీలు పనులకు రావాలని కోరారు.