ముందస్తు సంక్రాంతి వేడుకలలో అలరించిన విద్యార్థులు

799చూసినవారు
ముందస్తు సంక్రాంతి వేడుకలలో అలరించిన విద్యార్థులు
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని విస్డం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సాంప్రదాయ దుస్తులు దరించిన విద్యార్థిని, విద్యార్థులు పాఠశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో పాల్గొని పండుగ విశిష్టతను తెలిపే రంగు రంగుల ముగ్గులను వేశారు. చిన్న పిల్లలు వేసిన హరిదాసు వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవేందర్ ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులను ప్రధానం చేసి, సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు డైరెక్టర్లు సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్