స్వేరోస్ భీమ్ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

391చూసినవారు
స్వేరోస్ భీమ్ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ
వరంగల్ రూరల్ జిల్లా స్వేరోస్ భీమ్ దీక్ష పోస్టర్ ను పర్వతగిరి మండల కేంద్రంలో శనివారం స్థానిక సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో డిసిఓ సుభాషినిదేవి ఆవిష్కరించడం జరిగింది. జ్ఞాన సమాజ నిర్మాణమే లక్ష్యంగా స్వేరోస్ నెట్ వర్క్ చేస్తున్న కృషని అభినందించారు. ఈ సందర్భంగా స్వేరోస్ నాయకులు మాట్లాడుతూ.. భీమ్ దీక్షను ఆచరించడం ద్వారా స్వెరోలు శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని సాధించి జ్ఞానవంతంగా తయారవుతారని, తద్వారా జ్ఞాన సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుతారని అన్నారు.

ఈ నెల 15వ తేదీ నుండి స్వేరోస్ భీమ్ దీక్ష ప్రారంభమవుతుందని తెలిపారు. దీక్ష సమయంలో ఆచరించవలసిన నియమాలను వివరిస్తూ స్వేరోస్ నాయకులకు పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ వైస్ ప్రిన్సిపల్ బద్రుద్దీన్ మరియు ఉపాధ్యాయ బృందం స్వేరోస్ ఇంటర్నేషనల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ జంగిలి యాకయ్య, స్వేరోస్ సీనియర్ నాయకులు డాక్టర్ జిల్లా శ్రీనివాస్, పర్వతగిరి మండల అధ్యక్షులు గారే జయరాజ్, ఉపాధ్యక్షులు స్కైలాబ్ బాబు, ఇస్లావత్ హరీష్, అర్షం ఆనంద్, సహాయ కార్యదర్శి మచ్చ రవి, కోశాధికారి భూక్య ప్రవీణ్, నాయకులు చందు, ఇస్లావత్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్