వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులు 42 మందికి, 42 లక్షల 4వేల 872 రూపాయల విలువ గల చెక్కులను శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనారోగ్యానికి గురి అయిన వారికి సిఎంఆర్ఎఫ్ ద్వారా 14 మంది లబ్ధిదారులకు, 5 లక్షల 10 వేల రూపాయల విలువ గల చెక్కులను అందించారు. పేద ప్రజలకు అండగా కళ్యాణ లక్ష్మి పథకం నిలుస్తుందన్నారు.