సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర రేపటి(శుక్రవారం) షెడ్యూల్‌ను YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గం. ఎస్‌టీ రాజపురం నుంచి బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట, ఉందురు, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గం. కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పలు గ్రామాల మీదుగా వెళ్ళి గొడిచర్ల లోని రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.