కొందరి పొరపాటు వల్లే పీఓకేపై నియంత్రణ కోల్పోయాం: జైశంకర్

53చూసినవారు
కొందరి పొరపాటు వల్లే పీఓకేపై నియంత్రణ కోల్పోయాం: జైశంకర్
పాక్ ఆక్రమిత కశ్మీర్( పీఓకే)పై విదేశాంగ మంత్రి జై శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరెత్తకుండానే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన తప్పులే కారణం అని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ విలీనం చేసుకునే విషయమై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు. కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారిందని, దానిపై పట్టు కోల్పోవడానికి వారి పొరపాటే కారణం అని నెహ్రూపై పరోక్షంగా ఆరోపణలు చేశారు.

సంబంధిత పోస్ట్