గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తాం: పవన్‌ కల్యాణ్

85చూసినవారు
గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తాం: పవన్‌ కల్యాణ్
అల్లూరి జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు రోడ్లు వేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ తెలిపారు. డోలీ మోతలు లేని రాష్ట్రం దిశగా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. ఈ రోజుల్లోనూ డోలీ కట్టి నలుగురు మోయడం బాధాకరమన్నారు. ‘గిరిజన యువత తలుచుకుంటే వాళ్ల జీవితాల్లో మార్పు వస్తుంది. రెండు వేల గ్రామాల్లో రోడ్లు లేవు.. దానికి రూ.2,849 కోట్లు అవుతుంది. గిరిజన గ్రామాల రోడ్లకు ఏటా రూ.350 కోట్లు కేటాయిస్తాం’ అని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్