TG: త్వరలో భారీ భూకుంభకోణాన్ని బయటపెడతా అని మాజీ KTR అన్నారు. 400 ఎకరాలు కాదు.. దాని వెనుక వేలఎకరాల వ్యవహారం ఉందని తెలిపారు. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని, ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే, మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని సెటైర్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి సీఎం రేవంత్‌రెడ్డి అని, రేవంత్‌ని కాపాడుతోంది బండి సంజయ్ అని ఆరోపించారు.