కొత్తగా కట్టిన నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తాం: హైడ్రా

77చూసినవారు
కొత్తగా కట్టిన నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తాం: హైడ్రా
తెలంగాణలో ఎక్కడ చూసిన ప్రస్తుతం హైడ్రా హల్‌చల్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కాన్సెప్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చెరువులు, బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని.. అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ క్రమంలో తాజాగా హైడ్రా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలోని.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలు కూల్చివేతలు చేయబోమని, ఇక మీదట కొత్తగా కట్టిన నిర్మాణాలను మాత్రం కూల్చివేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు.