సాధారణంగా సిజేరియన్ తర్వాత మహిళలు బరువు పెరుగుతారనే అపోహ చాలామందిలో ఉంటుంది. సిజేరియన్ తర్వాత కొందరు కాస్తంత బరువు పెరిగినప్పటికీ అందుకు కారణం సిజేరియన్ మాత్రం కాదు. దేహానికి తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. చిన్నారులకు తల్లిపాలు పట్టించడం వల్ల మహిళలు బరువు పెరగకుండా ఉంటారు. నడక వ్యాయామం అందరికీ ప్రయోజనకరం. నడక వల్ల మహిళలు తమ అదనపు కొవ్వు కోల్పోయి లావు తగ్గుతారు.