హైకోర్టు తీర్పుపై సుప్రీంకు పశ్చిమ బెంగాల్‌

85చూసినవారు
హైకోర్టు తీర్పుపై సుప్రీంకు పశ్చిమ బెంగాల్‌
పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో 25,700కు పైగా ఉద్యోగ నియామకాలను రద్దు చేస్తూ కోల్‌కత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా బెంగాల్‌ ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఏకపక్షంగా ఈ తీర్పు ఇచ్చిందని పిటీషన్‌లో ప్రభుత్వం ఆరోపించింది. ‘రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వకుండా.. తక్షణం అమలుతో బోధన, బోధనేతర సిబ్బందిని హైకోర్టు విధుల నుంచి తొలగించింది’ అని పిటిషన్‌లో తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్