వామ్మో.. 2 గదులకు ఏకంగా రూ.20లక్షల కరెంట్ బిల్లు

574చూసినవారు
వామ్మో.. 2 గదులకు ఏకంగా రూ.20లక్షల కరెంట్ బిల్లు
గుజరాత్‌లో ఓ కుటుంబానికి కరెంటు బిల్లు షాక్ తగిలింది. నవసారిలో నలుగురు నివసించే 2 గదుల ఇంట్లో 4 ఫ్యాన్లు, 2 బల్బులు, ఓ చిన్న ఫ్రిజ్, టీవీ ఉన్నాయి. అయితే వీరికి ప్రతి నెలా రూ.2000 లోపే కరెంట్ బిల్లు వచ్చేది. కానీ, గత నెలకు ఏకంగా రూ.20 లక్షల కరెంటు బిల్లు రావటంతో ఆ కుటుంబం ఖంగుతున్నది. కాగా.. పొరపాటు జరిగిందని, తప్పును సరిదిద్దామని గుజరాత్ విద్యుత్ బోర్డు వివరణ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్