ఇది జ్వరంతో మొదలవుతుంది. నాలుగైదు రోజులుంటుంది. ఒళ్లునొప్పులుంటాయి. తల, కండరాలు, కీళ్ల నొప్పులు ఎక్కువ అవుతాయి. కొంతమందికి వాంతులు, కడుపునొప్పి కూడా ఉంటుంది. కొందరికి చర్మంపై ఎర్రదద్దుర్లు వస్తాయి. ఈ లక్షణాలు డెంగ్యూ, వైరల్ జ్వరాల్లోనూ ఉంటాయి. డెంగ్యూ జ్వరం వస్తే ఎర్రదద్దుర్లు చర్మంపై వస్తాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోతుంది. చలితో జ్వరం వస్తే మలేరియాగా అనుమానించాలి. నీరు, ఆహారం కలుషితం అయితే టైఫాయిడ్ వస్తుంది.