కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్లోని పార్టీ ఆఫీస్ లో బీజేపీ 44వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. గొప్పగా ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు చేయించలేని రాహుల్ గాంధీ.. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు.' అని ప్రశ్నించారు.