మానవత్వం అంటే ఇదేనేమో (వీడియో)

73చూసినవారు
కేరళలో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటుచేసుకుంది. కొల్లాంలోని చవరాలో ఉన్న అయ్యన్‌కోయికల్ హెచ్‌ఎస్‌ఎస్‌ స్కూల్‌లో ఓ దివ్యాంగ విద్యార్థి పట్ల మరికొందరు విద్యార్థులు ప్రవర్తించిన తీరు మనసును కదిలిస్తోంది. మంత్రి వి. శివన్‌కుట్టి ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. కొందరు 5వ తరగతి విద్యార్థులు మధ్యాహ్న భోజనం తర్వాత వికలాంగుడైన తమ క్లాస్‌మేట్‌కు నిస్వార్థంగా సహాయం చేశారు. అతడికి అన్నం తినిపించడం, ముఖం, చేతులు కడగడం ఈ వీడియోలో చూడొచ్చు.

సంబంధిత పోస్ట్