కావడి యాత్ర అంటే ఏమిటంటే?

85చూసినవారు
కావడి యాత్ర అంటే ఏమిటంటే?
ప్రతి ఏటా శ్రావణమాసంలో ఉత్తర భారతంలో కావడి యాత్ర నిర్వహిస్తుంటారు. ఒక వెదురు కర్రకు ఇరువైపులా కుండలు కట్టాడాన్ని కావడి అంటారు. ఈ కావడితో కాలినడకన వెళ్లి హరిద్వార్, గౌముఖ, గంగోత్రి వంటి ప్రదేశాల నుంచి గంగా జలాన్ని సేకరించి, మాసశివరాత్రి త్రయోదశినాడు తమ గ్రామాల్లోని శివాలయాలలో శివలింగానికి అభిషేకం చేస్తారు. అందుకే దీనికి కావడి యాత్ర అనే పేరు వచ్చింది. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది.

సంబంధిత పోస్ట్