బస్టాండ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల లాంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన యూఎస్‌బీ ఛార్జింగ్ స్టేషన్లను ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారు. ఈ తరహా దాడులనే ‘జ్యూస్ జాకింగ్’ అంటారు. వీటితో జాగ్రత్తగా ఉండాలని సీఈఆర్‌టీ(ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) సూచించింది. ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.