ఏపీలో 12 అడుగుల భారీ గిరినాగు హల్‌చల్ (వీడియో)

70చూసినవారు
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ నాగుపాము హల్‌చల్ చేసింది. జిల్లాకేంద్రం సమీపంలోని మాడుగుల శివారులో ఓ రైతు పొలంలో శుక్రవారం 12 అడుగుల భారీ గిరినాగు కనిపించింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న రక్తపింజర పామును కూడా గిరినాగు వేటాడి మింగేసింది. రైతు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్లు చాకచక్యంగా గిరినాగును పట్టుకొని బంధించారు. దీంతో సదరు రైతు హర్షం వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్