ఉగాది రోజు ఏం చేయాలి?

73చూసినవారు
ఉగాది రోజు ఏం చేయాలి?
ఇవాళ ఉగాది పర్వదినం. ఉగాది రోజు ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించాలి. దైవ దర్శనం చేసుకుని, ఇంట్లో పెద్దల ఆశీస్సులను తీసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసుకుని గుమ్మానికి మామిడి, పూల తోరణాలతో అలంకరించాలి. దేవతార్చన, పంచాంగం పూజ చేయాలి. ఉగాది పచ్చడి, బొబ్బట్లు, పూర్ణాలు నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం పంచాంగ శ్రవణం చేయాలి.

సంబంధిత పోస్ట్