సాధారణంగా రకరకాల పురాతన వస్తువులకు మ్యూజియంలు ఏర్పాటుచేస్తారు. కానీ ఇటీవల క్రొయేషియాలో కొందరు ఔత్సాహికులు నెక్‌టైల కోసం ప్రత్యేకంగా 'క్రావాటికం' పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రారంభించారు. నాలుగు శతాబ్ధాల కిందట నెక్‌టైల వాడుక మొదలైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రకరకాల నెక్‌టైలను సేకరించి ఇందులో ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియంలో నెక్‌టైల చరిత్రకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కూడా పొందుపరచారు.