2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎక్కడ?: కేటీఆర్

52చూసినవారు
2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎక్కడ?: కేటీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్న హామీ ఏమైందని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ‘మీరు యువతను వ్యక్తిగతంగా కలిసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. వార్తాపత్రికల్లో యాడ్‌లు ఇచ్చారు. 7 నెలలు దాటినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఎలా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తారు? ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోనందున మీరైనా స్పందించండి’ అని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.