ప్రకృతిలో ఉండే సహజ శత్రువులు ఎన్కార్సియా గ్వాడెలోప్, ఎన్కార్సియా నోయి.. తెల్లదోమలను నియంత్రించే పరాన్న జీవులు. వీటి గురించి స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలను తీసుకొని వినియోగిస్తే మంచి ఫలితాలుంటాయి. గత కొన్నేళ్లుగా రూగోస్ తెల్లదోమ దీనినే సర్పిలాకార తెల్లదోమ అని కూడా అంటారు. ఇది ఇతర దేశాల నుంచి భారత్‌కు వ్యాప్తి చెంది కొబ్బరి, ఆయిల్‌పామ్ పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. రైతులు సకాలంలో గుర్తించాలి.