ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీపాక్స్ వైరస్‌కు తొలి వ్యాక్సిన్ ఎంవిఎ-బిఎన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను అత్యవసరమైన కమ్యూనిటీలకు ఇవ్వనున్నారు. తమ ప్రీ క్వాలిఫికేషన్ జాబితాలో ఈ వ్యాక్సిన్‌ను చేర్చినట్లు డబ్ల్యుహెచ్‌ఓ శుక్రవారం ప్రకటించింది. 18ఏళ్ళు పైబడిన వారికి నాలుగు వారాల తేడాలో రెండు డోసులుగా ఈ వ్యాక్సిన్‌ను అందచేస్తారు.