పార్లమెంట్‌లో అత్యంత కీలకమైన ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ నియమితులయ్యారు. 15మంది లోక్‌సభ ఏంపీలు, 7 రాజ్యసభ సభ్యులతో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి వేణుగోపాల్ నేతృత్వం వహిస్తారు. లోక్‌సభ సచివాలయం ఆగస్టు 16న దీనికి సంబంధించిన ప్రకటన జారీ చేసింది. 2025 ఏప్రిల్ 30 వరకు ఈ కమిటీకి గడువు ఉంటుంది.