ఫిజి ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం 'కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి’ని ఇటీవ
ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రదానం చేశారు. ఆమె ఇటీవల రెండు రోజుల పాటు ఫిజీలో పర్యటించారు. ఇరుదేశాల మధ్
య 75 ఏళ్ల దౌత్య అనుబంధానికి గుర్తుగా అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించారు. ఫిజి అధ్యక్షుడు విలియం కటోని వెరే, ప్రధాన మంత్రి సితివేని రబుకా దీన్ని ఆమెకు అందజేశారు.