బార్ల్కీ మారథాన్‌ను పూర్తి చేసిన తొలి మహిళ ఎవరు?

57చూసినవారు
బార్ల్కీ మారథాన్‌ను పూర్తి చేసిన తొలి మహిళ ఎవరు?
అమెరికాలోని టెన్నీసీ రాష్ట్రంలో ఫ్రోజెన్ హెడ్ స్టేట్ పార్కులో ప్రపంచంలోనే అత్యంత కఠోరమైన బార్ల్కీ మారథాన్‌ను నిర్వహించారు. 55 మైళ్లుగా ఉన్న ఈ మారథాన్‌ను 1989లో 100 మైళ్లకు పెంచాక ఇన్నేళల్లో నిర్ణీత గడువు(60 గంటల వ్యవధి)లోగా దాన్ని కేవలం 20 మంది మాత్రమే పూర్తి చేయగలిగారు. వీరిలో జాస్మిన్ పారిస్ ఒక్కరే మహిళ కావటం విశేషం. 59 గంటల 58 నిమిషాల 21 సెకన్లలో ఈమె ఈ రేసును పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్