ప్రతిష్టాత్మక 12వ విశ్వ హిందీ సమ్మాన్ పురస్కారాన్ని డాక్టర్ ఉషా ఠాగూర్‌కు ప్రదానం చేశారు. హిందీ సాహిత్యానికి ఈమె చేసిన విశిష్ట సేవలకు, హిందీ-నేపాలీ భాషల మధ్య బంధాలను బలోపేతం చేయటంలో కృషి చేసినందుకు ఈమెకు ఈ పురుస్కారం లభించింది. కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన 'నేపాల్-భారత్ సాహిత్య సమారోహ్' కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.